మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కేజీ తోతాపురి రూ.4 చొప్పున రూ.160 కోట్లకు పైగా ఈ నెల 20 నుండి 25 వ తేదీలోపు దాదాపు 37 వేల మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో మామిడి రైతులకు జమ చేయనున్న సబ్సిడీ పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ మామిడి సీజన్ లో సుమారు 37 వేల మంది రైతుల నుండి గుజ్జు పరిశ్రమలు మరియు ర్యాంపు ల ద్వారా దాదాపు 4.10 మెట్రిక్ టన్నుల తోతాపుర