తోటపల్లి కెనాల్ లో కవిరాయిని వలస వద్ద శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్ళిన జమ్ములమడుగు శంకరరావు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడు తెర్లాం మండలం సింగి రెడ్డివలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కెనాల్ లో జారిపడి మృతి చెందిన శంకరరావు మృతదేహాన్ని వెలికి తీయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.