బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుగుణ అన్నారు. మంగళవారం ములుగు MLA క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడితే పదవులు వస్తాయని, ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. పదవులకు తగ్గట్టు పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళ విభాగం ప్రధాన పాత్ర పోషించాలన్నారు.