సత్య సాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పుట్టపర్తిలో డి ఆర్ డి ఏ ఆఫీస్ పక్కన ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకుడు భాను ప్రకాష్ గురువారం మధ్యాహ్నం తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీన వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి మందులు అందిస్తామని కంటిలో శుక్లాలు ఉన్నవారు ఆపరేషన్లు అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.