అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకం వల్ల పంటలకు నష్టం కలుగుతుందని ప్రొద్దుటూరు వ్యవసాయ శాఖ ఏడి.అనిత తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లె రైతు శిక్షణా కేంద్రంలో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన నిర్వహించారు. గుళిక రూపంలోని యూరియా కన్నా, నానో యూరియా మంచిదన్నారు. నత్రజని కోసం యూరియాను వాడుతున్న రైతులు కాంప్లెక్సు ఎరువుల్లో నత్రజని ఉంటుందని తెలుసుకోవాలని యంఎఓ. వరహరికుమార్ తెలిపారు.