సంగారెడ్డి లోని వెల్నెస్ హాస్పిటల్ ఎదురుగా గుర్తుతెలియని మృతదేహం లభమైనట్లు సంగారెడ్డి రూరల్ రవీందర్ తెలిపారు. తెలిపిన కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి నీలిరంగు టీ షర్టు నలుపు రంగు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడని వయసు 45 నుండి 50 వరకు ఉంటుందని అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పరిశీలించి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు మీడియాతో తెలిపారు.