మానకొండూర్లో బీఆర్ఎస్ ధర్నా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో మంగళవారం మద్య్హనం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.మానకొండూర్లోని పల్లె మీద చౌరస్తాలో బీఆర్ఎస్ కార్య కర్తలు రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేత తాళ్లపల్లి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. కేవలం కేసీఆర్ పేరును బదనాం చేయడానికి ఇలాంటి చర్యలకు