సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.