మధురవాడ సబ్ స్టేషన్ లో సాంకేతిక లోపంతో మధురవాడ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. మధురవాడ విద్యుత్ కార్యాలయానికి భారీ ఎత్తున పిర్యాదులు రావటంతో విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ త్వరిత గతిన పునరుద్దరణ అయ్యేలా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ అంతరాయానికి గల సమస్యను గుర్తించి విద్యుత్ పునర్ధనకు ప్రయత్నం ప్రారంభించారు. విద్యుత్ పునరుద్దరణ సుమారు అర్ధ గంట పట్టే అవకాశం ఉంటుందని సిబ్బంది తెలిపారు.