కరీంనగర్ లో నిన్న జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో గురువారం కరీంనగర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..బొమ్మకల్ బైపాస్ లో బుధవారం ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బెట రాధను బొమ్మకల్ బైపాస్ రోడ్డులో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. కింద పడిన రాధ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.