కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ అది శేషారెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ రామ లింగేశ్వర రెడ్డి, డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ జుబేదా, సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ విజయ భాస్కర్, ఎంపీడీఓ శివారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు మండలలో 2024.25 సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై, వాటిల్లో జరిగిన అవకతవకలపై అడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పద్మారాణి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.