తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించడం శుభ పరిణామం అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని బి.పి మండల్ విగ్రహం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియా కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఒక హామీను కూడా అమలు చేయలేదన్నారు. తక్షణమే సీఎం చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.