నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు. రూ 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునః నిర్మాణానికి ప్రతిపాదనల నేపథ్యంలో భాగంగా ఆలయాన్ని పరిశీలించారు. డిప్యూటీ స్థపతి తయారు చేసిన ప్లాన్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అందించారు.