ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ డివిజన్లో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు ఒక మోటార్ సైకిల్ ను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస ఆధ్వర్యంలో డీఎస్పీ షరీఫ్ మార్గం నిర్దేశంలో టాస్క్ఫోర్స్ టీం ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్ లోని బెస్తవారిపేట అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు వీరు గుంతపల్లి బీట్ పరిధిలో చేరుకునేసరికి అక్కడ ఒక మోటార్ సైకిల్ వద్ద కొంతమంది వ్యక్తులు గుమ్మికూడి కనిపించారు వారిని సమీపించడంతో పోలీసులను చూసి ప