యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట లోని బిజెపి అధ్యక్షుడు మేకల రమేష్ ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి గాంధీ చౌరస్తా నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మండల తహసిల్దార్ అనితకు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని అన్ని గొలుసు కట్టు చెరువులను నింపాలన్నారు. మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.