సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగి, సేవాకార్యక్రమాలతో ప్రజల గుండెల్లో ఒదిగిన పద్మవిభూషణ్ కొణిదల చిరంజీవి జీవితం ఆదర్శనీయం అని భీమడోలు మండల జనసేనపార్టీ అధ్యక్షులు ప్రత్తి మదన్ అన్నారు. శుక్రవారం భీమడోలులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంతమార్కెట్ సెంటర్ లోని జనసేన స్థూపం వద్ద మెగాభిమానులు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మొక్కలు నాటారు. వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు నిత్యావసరాలు పంపిణీ చేసారు.