మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతన సిసి రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం సాయంత్రం వెంకటాపూర్ మండలంలో అంతర్గత రోడ్లు, అంగన్వాడీ భవనం, నూతన గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.