ఆదిలాబాద్ కలెక్టరేట్లో కూలిన భవనాన్ని కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ సలోని గురువారం రాత్రి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలిందని కలెక్టర్ తెలిపారు. కొత్త కలెక్టరేట్ భవనం త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లిని కోరినట్లు పేర్కొన్నారు.