నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వినాయక ఉత్సవాన్ని శుభం కార్డుతో ముగించేద్దామని ఉత్సవ కమిటీ నాయకులకు నందికొట్కూరు రూరల్ సీఐ టి. సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు,గురువారం సాయంత్రం మండల పరిధిలోని స్థానిక బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాల విగ్రహ ఉత్సవ కమిటీ నాయకులతో ఎస్ఐ తిరుపాల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన నిర్వహించబోయే వినాయక చవితి పండగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే విగ్రహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలని సూచించారు,విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో ఐదుగురికి పైగా వ్యక్తులు కమిటీగ