భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన మొండక్క అనే వృద్ద మహిళా పని నిమిత్తం ఇంటి బయటకి రావడంతో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దొంగ బైక్ పై వచ్చి మెడలో ఉన్న నాలుగున్నర తులాల పుస్తెలతాడును లాకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొలుసు లాగుతున్న క్రమంలో మొండెక్క కిందదపడగా మెడకు గాయాలైనట్లు భర్త మొగిలయ్య తెలిపారు.ఈ నేపద్యంలో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘనపురం ఎస్సై అశోక్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు.