పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీలో వైద్యుల తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరావధిక సమ్మె ప్రారంభించారు. దీంతో పిహెచ్సిలో ఓపి సేవలను నిలిపివేసినట్లు డాక్టర్ రమ్య మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యశాలకు వచ్చిన రోగులకు వైద్యం అంతగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే డిఎంహెచ్వో కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.