అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియం లో సబ్ కలెక్టర్, ఆర్డీవో లు, తహసీల్దార్ లు, మండల సర్వేయర్ లు, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ లతో పలు రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ కి వచ్చే అర్జీలలో 80 నుండి 85 శాతం వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే ఉంటాయన్నారు