నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డే బోయిన సైదులు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వడ్డే పోయిన సైదులు మాట్లాడుతూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పిహెచ్డి చేసి చదువుకు సార్ధకత లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాటలు ఉన్నాయని ఆయన మాటలు ఆయన తీరు ఆయన వ్యవహారం మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని అన్నారు ముఖ్యమంత్రి పై మంత్రిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలను సమాజంలోని ప్రజలు అసహించుకుంటున్నారు అని ప్రశ్నించారు.