నేరాలను నియంత్రించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. నేరగాళ్లను పట్టుకున్నప్పుడు వారి కనుపాపలను (ఐరిస్) స్కాన్ చేయడం ద్వారా గత నేర చరిత్ర సహా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ కొత్త విధానంతో నేరగాళ్ల ఆట కట్టించవచ్చని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఐరిస్ స్కానింగ్ యంత్రాన్ని డీఎస్పీ సత్తయ్య గౌడ్ పరిశీలించారు.