గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు రావు తో కలిసి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది.