విద్యుత్ స్మాట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు గురువారం బాపట్లలో ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో బషీర్బాగ్ కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, తదితరులు పాల్గొన్నారు.