గిడుగు రామ్మూర్తి పంతులుకు కలెక్టరెట్ లో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో శుక్రవారం మద్యాహ్నం 12 గంటల సమయంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ, తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడంలో గిడుగు రామ్మూర్తి కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీ కే. చంద్రశేఖర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.