జిల్లాలోని 59 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సదాశివపేట మండలం వెల్టూరు ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రీ ప్రైమరీ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ తరగతులలో ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్ కూడా పాల్గొన్నారు.