ప్రకాశం జిల్లా పొదిలిలో సిఐ వెంకటేశ్వర్లు ఆదివారం సైకిల్ తొక్కడం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులు పోలీసులు సిబ్బందితో కలిసి సైకిల్ కార్యక్రమానికి నిర్వహించారు. పొదిలి పోలీస్ స్టేషన్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఐ వెంకటేశ్వర్లు సైకిల్ తొక్కి ప్రజలకు అవగాహన కల్పించారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారని అన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు సిఐ వెంకటేశ్వర్లు అన్నారు.