పార్టీ కోసం జీవితాంతం పోరాటం చేసిన సీనియర్ నాయకులు ఎప్పుడు తరం తరం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని సిపిఐ సీనియర్ నాయకులు స్టాలిన్ బాబు, చేకూరి రామకోటేశ్వరరావు, గూడవల్లి నాగేశ్వరరావు లను వారి నివాసాల్లో పరామర్శించారు. వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం జీవితాంతం పోరాటం చేసిన సీనియర్ నాయకులు ఎప్పుడు తరం తరం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులు అని తెలిపారు.కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పలువురు నేతలు పాల్గొన్నారు.