తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో పర్యటించారు. నగరంలోని RDT కార్యాలయంలో డైరెక్టర్ మంచో ఫెరర్రను కలిశారు. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకపోవడంపై చర్చించారు. జిల్లాకు కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి వెంటనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని జేసీ అభిప్రాయపడ్డారు.