పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో గల ఐటీడీఏ పార్కు వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో చెందిన సంఘటన గురువారం చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జియమ్మ వలస మండలం రామినాయుడువలస గ్రామానికి చెందిన పెద్దింటి సూర్యనారాయణ (55), స్కూటీపై వెళ్తుండగా ఐటీడీఏ పార్క్ వద్ద కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.