ర్యాగింగ్ ఒక సరదా కాదు, అది ఒక నేరమని రాచకొండ పోలీసులు తెలిపారు. కొట్టడం, అవమానించడం, బంధించడం ఇవన్నీ ర్యాగింగ్ కిందకు వస్తాయని చట్టప్రకారం ఇవన్నీ శిక్షార్హమైన నేరాలేనని అన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే 100,112 కి కాల్ చేయాలి, ఒకసారి ర్యాగింగ్ కేసు రిజిస్టర్ అయితే భవిష్యత్తు చీకటమయం అవుతుందన్నారు. ర్యాగింగ్ ఎంత ప్రమాదకరమో పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలని తెలుపుతూ రాచకొండ పోలీసులు వీడియోని విడుదల చేశారు.