పీలేరు మండలం పీలేరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 46మంది కార్మికుల చేత గత ఈఓ వై.గురు మోహన్ 2024మే,జూన్ నెలలో వెట్టి చాకిరి చేయించుకుని జీతాలు ఇవ్వక పోవడం,సర్పంచ్ హబీబ్ భాషా తో పాటు వార్డు సభ్యులు సమావేశంలో తీర్మానించి ఒక్కొక్కరికి 3వేల రూపాయలు పెంచి ఇవ్వగా అందులో నుంచి కూడా ఒక్కొక్క కార్మికుని నుంచి వెయ్యి రూపాయలు ఈఓ గురు మోహన్ తగ్గించి ఇచ్చాడని, అందుకు ఏ.పి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు