ఆదివారం రోజున జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్ ఫేజ్ - 3 సంక్షేమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పార్కుకు ప్రహరీ గోడ నిర్మింప చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పార్కులను అభివృద్ధి పరిచే ప్రజలకు అందజేస్తామని తెలిపారు.