జీడీ నెల్లూరు నియోజవర్గము జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే థామస్ శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోనూ, వృత్తిపరంగానూ రాణించడం కష్టమని అన్నారు. తాను IVF ద్వారా పిల్లలను పుట్టిస్తుంటానని, పేషంట్లను చూస్తున్నప్పుడే నియోజకవర్గం నుంచి కాల్స్ వస్తుంటాయని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తానని, గతంలో జీడీనెల్లూరులో సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, ఈసారి కూడా అలాగే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరిని ఎక్కడ అణచివేయాలో తాను చూసుకుంటానని, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.