కరసలి గూడ మరియు లిట్టిగూడ గ్రామాలకు నీరు వెళ్లే కల్వర్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలను నీటిపారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు.నియోజకవర్గంలోని పెదలబుడు గ్రామస్తులు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కరసలి గూడ మరియు లిట్టిగూడ గ్రామాలకు నీరు వెళ్లే కల్వర్టు నిర్మాణ పనులు అసంపూర్తిగా జరుగుతుండడంతో,వారు ఎమ్మెల్యే దృష్టిలోకి తీసుకువెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే గారు చిన్న నీటిపారుదల శాఖ అధికారి (SMI) గారితో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన కల్వర్టు పనులు నాణ్యత పాటించి పూర్తి చేయాలని ఆదేశించారు.