శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో హాస్టల్ డైలీ వేజెస్ వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన సమ్మె కార్యక్రమం ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న పాఠశాల హాస్టల్ వర్కర్లకు 9 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వేతనాలు లేక వెట్టి చాకిరి చేస్తున్నామని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి పాఠశాల హాస్టల్ డైలీ వేజెస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.