సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం నుండి భారీగా వర్షం కురుస్తుంది. దీంతో జోగిపేట పట్టణంలో ప్రధాన రహదారిపై రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా రైతులు పండిస్తున్న పత్తి పంట తీవ్రంగా పాడైపోతుందని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు సతమతమవుతున్న సమయంలో మళ్లీ వర్షం కురవడంతో రైతులు బయో ఆందోళనలకు గురవుతున్నారు.