జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఐదు లక్షల గాంబూసియా చేప పిల్లలను విడిచిపెట్టే మహా కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం అరసవల్లి దేవస్థానం ఇంద్రపుష్కరినిలో 750 చేప పిల్లలను వదిలిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు. దోమల లార్వా ఆక్సిజన్ కోసం నీటి మీదకు వచ్చిన క్షణంలో గాంబూసియా చేపలు వాటిని పూర్తిగా తినేస్తాయి. కుంటలు, చెరువులు, చిన్నపాటి నీటి నిల్వల్లో ఎక్కడైనా ఇవి జీవించగలవు. చిన్న సైజులో ఉన్నా వీటి వేగమే దోమలకు ముప్పు అని వివరించారు.