భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ కలెక్టర్ అశోక్ కుమార్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.