రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్డు వాల్మీకి నగర్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు దాటుతున్న పాదచారిని డీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెచ్చిరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం రాత్రి రాయదుర్గం నుండి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించక డీకొన్నారని స్థానికులు తెలిపారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరితోపాటు రోడ్డు దాటుతున్న వ్యక్తి కూడా గాయపడ్డారు. వీరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.