ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల దగ్గర తప్పనిసరిగా బ్యానర్స్ ఫోటోలలో చత్రపతి శివాజీ బాలగంగాధర్ తిలక్ ఫోటోలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎందుకంటే చత్రపతి శివాజీ మహారాష్ట్ర సాధనకు ప్రయత్నం చేసే సమయంలో ప్రజల అందరినీ ఏకం చేయాలని గణపతి ఉత్సవాలు చాలా ఉపయోగపడ్డాయి అన్నారు. బాలగంగాధర్ తిలక్ ప్రతి భారతీయుడు స్వాతంత్ర స్ఫూర్తి రగిలించడంలో భారతీయులందరూ సమైక్యంగా కలిసి ఉండాలని చెప్పడం జరిగిందన్నారు.