ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం లోని పలు గ్రామాలలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయనిధి నుండి విడుదలైన చెక్కులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. సుమారు 9 మందికి 10 లక్షల 36,429 రూపాయల చెక్కులను అందజేసినట్లు వసంత లక్ష్మి తెలిపారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతను అందించేందుకు సీఎం సహాయ నిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అని వసంత లక్ష్మి అన్నారు.