పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజానాయకుడు. ఆయనలోని క్రమశిక్షణ, సమాజ పట్ల బాధ్యత, ప్రతి ఒక్కరిని సమానంగా చూడగల గుణం కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తుంది అని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం చిట్వేల్ మండల కేంద్రంలో జరుగుతున్న రక్తదానం, వస్త్రదానం, విద్యార్థులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ఆయన పట్ల ఆయన ఆశయాల పట్ల అభిమానులకు ఉన్న నిబద్ధతకు ప్రతిబింబం అని అన్నారు. బైక్ ర్యాలీలో రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు.