పార్వతీపురం డిపో నుండి కూనేరు నుండి మసీమండ గ్రామం మీదగా ఎండబద్ర గ్రామం మీదుగా లంజి గ్రామం వరకు బస్సు సౌకర్యం వెంటనే కల్పించి అన్ని విధాలుగా గిరిజన ప్రజలతోపాటు గర్భిణీ స్త్రీలకు మెరుగైన ప్రయాణం కల్పించాలని కోరుతూ కొమరాడ మండలం రాంబద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు బుధవారం గర్భిణీ స్త్రీలతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ RTC అధికారుల నిర్లక్ష్యం వల్ల కొమరాడ మండలంలో గిరిజన పంచాయితీల