రాయదుర్గం టౌన్, కణేకల్లు మండల కేంద్రాలలో వీరభద్రేశ్వర స్వామి జయంతి మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వీరబద్రాలయం లో రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. కణేకల్లు లోని వీరభద్ర ఆలయం నుంచి సమీపంలోని వేదవతి-హగరి నదికి చేరుకుని గంగపూజ నిర్వహించారు. అనంతరం గంగాజలాన్ని తీసుకువచ్చి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రుడి వేషధారణతో చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు వీరశైవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.