ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామంలోని రోడ్లను ఎంపీడీవో నూర్జహాన్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల రోడ్లపై అపరిశుభ్రత ఏర్పడిన నేపథ్యంలో మీడియా వార్తలకు స్పందించి ఆమె వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల నివారణ చర్యలు చేపట్టారు. రోడ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు.