బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బొజ్జల తిరుపతి: రేణిగుంట మండలం గురవరాజుపల్లి డయేరియా బాధితులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శించారు. బుధవారం బాలాజీ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నీటి కాలుష్యమే అతిసార వ్యాధికి కారణమని ఆయన తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం, సహాయం అందిస్తున్నామన్నారు. గ్రామంలో 24 గంటల మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.