ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో విద్యార్థినీయులను వేధించిన ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని గురువారం దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్రావు డిమాండ్ చేశారు. ఒంగోలు పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నాగేందర్రావు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేస్తామని తెలిపారు.